మోక్షజ్ఞ సినిమాలో కార్తీ

తమిళ స్టార్ హీరో కార్తీ(kaarthi) అంటే తెలుగు ఆడియెన్స్ కూ ఇష్టమే. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతుంటుంది. ఊపిరి వంటి స్ట్రైట్ సినిమాలతోనూ కార్తీ ఆకట్టుకున్నారు. ఈ స్టార్ హీరో మరో తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞ(Mokshagna) హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో కార్తీ ఓ కీ రోల్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

దర్శకుడు ప్రశాంత్ వర్మ(Prashant varma) ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమాలో ఓ కీ రోల్ ఉందని, అది కార్తీ చేయబోతున్నారట. ఈ కథను ఇప్పటికే ప్రశాంత్ వర్మ కార్తీకి చెప్పగా..ఆయనకు నచ్చి ఓకే అన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు కార్తీ ఆసక్తి చూపిస్తున్నారు. కార్తీ నటిస్తే మోక్షజ్ఞ సినిమాకు అడ్వాంటేజ్ కానుంది.