ఎన్టీఆర్ ఆ మధ్య చికిత్స పొందుతున్న ఓ అభిమానితో ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ అభిమాని ఎన్టీఆర్ దేవర సినిమా చూసి చనిపోతానంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అతని మాటలకు, అభిమానానికి చలించిన ఎన్టీఆర్ సదరు అభిమానితో మాట్లాడి ధైర్యం చెప్పారు. నీకేం కాదు మళ్లీ నువ్వు ఆరోగ్యంగా తిరిగి వచ్చాక కలుద్దాం అంటూ చెప్పాడు.
అభిమాని చికిత్సకు అయ్యే డబ్బులు తాను ఇస్తానంటూ వారి కుటుంబ సభ్యులకు హామీఇచ్చాడు. తీరా ఇప్పుడా డబ్బులు ఇవ్వకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో తమ అబ్బాయికి చికిత్స పూర్తయిందని. హీరో ఎన్టీఆర్ మాత్రం మాట ఇచ్చినట్లు ఆర్థిక సాయం అందించలేదని తల్లి సరస్వతమ్మ చెబుతున్నారు. ఇంకా 20 లక్షలు అబ్బాయి ఆసుపత్రి ఖర్చులు కట్టాలని ఆర్థిక సాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. ఎన్టీఆర్ ఇప్పటికైనా స్పందించాలనే విమర్శలు వస్తున్నాయి.