జానీ మాస్టర్ కేసులో నిందితురాలిగా ఆయన భార్య

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Johnny master) లైంగిక వేధింపుల కేసులో ఆయన భార్య సుమలత(Sumalatha) కూడా ఇరుక్కునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జానీ మాస్టర్ తనపై చేసిన దాడి గురించి బాధితురాలు పోలీసుల కంటే ముందే ఫిలింఛాంబర్ ను ఆశ్రయించింది. ఆ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య సుమలత బాధితురాలిని కొండాపూర్ లోని తన ఇంటికి పిలిపించుకుని బెదిరించింది.

ఈ క్రమంలో బాధితురాలిపై దాడి చేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. బాధితురాలు నార్సింగి పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో తనను జానీ మాస్టర్ భార్య సుమలత బెదిరించడమే కాదు కొట్టిందని చెప్పింది. ఈరోజు నార్సింగి పోలీస్ స్టేషన్ కు సుమలత వెళ్లడంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. బాధితురాలి స్టేట్ మెంట్ ప్రకారం ఈ కేసులో ఆమెను కూడా నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయి. జానీ మాస్టర్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇక సుమలత ఇచ్చిన సమాచారంతోనే జానీ మాస్టర్ ను గోవాలో పోలీసులు అరెస్టు చేసినట్లు మరొక టాక్ వినిపిస్తోంది.