చంచల్ గూడ జైలుకు జానీ మాస్టర్

లైంగిక వేధింపుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను ఈ రోజు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై కోసం జానీ మాస్టర్ న్యాయవాది ప్రయత్నాలు చేస్తున్నారు

కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో జానీ మాస్టర్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు నార్సింగి పోలీసులు. ఈ ఉదయం జానీ మాస్టర్ ను రాజేంద్రనగర్ సీసీఎస్ నుంచి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉప్పర్‌పల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపర్చారు. తన నిర్దోషిత్వాన్ని న్యాయస్థానంలోనే నిరూపించుకుంటానని ఈ సందర్భంగా జానీ మాస్టర్ చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.