జానీ మాస్టర్ అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్(Johnny master) ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఎస్ ఓటీ పోలీసులు గోవాలో జానీ మాస్టర్ ను గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నారు. మహిళా కొరియోగ్రాఫర్ పై అత్యాచారం చేసిన జానీ మాస్టర్ పై రేప్ కేసుతో పాటు పోక్సో కేసు నమోదైంది.

కేసు విషయం మీడియాలో ప్రచారం కాగానే జానీ మాస్టర్ పరారయ్యారు. ఆయన నార్త్ ఇండియా వెళ్లినట్లు పోలీసులు ముందుగా భావించారు. అయితే హైదరాబాద్ లోని కొండాపూర్ ఇంటికి తాళం వేసి ఉండటం, జానీ మాస్టర్ భార్య ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో జానీ మాస్టర్ స్వస్థలం నెల్లూరులో సెర్చింగ్ చేశారు. చివరకు జానీ మాస్టర్ బెంగళూరుకు అక్కడి నుంచి గోవా(Goa)కు వెళ్లాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.