యాంకర్ విష్ణు ప్రియ ఓ టాక్ షోలో జేడీ చక్రవర్తిని ప్రేమిస్తున్నానని.. అతను ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. అంతే.. ఇక అక్కడ నుంచి జేడీ, విష్ణు ప్రియ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జేడీ చక్రవర్తి చాలా లేటుగా పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జేడీ విడాకులు తీసుకుని ప్రస్తుతం ఓంటరి జీవితం గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇదంతా నిజమేనేమో అనుకున్నారు. ప్రచారంలోఉన్న ఈ వార్తల పై జేడీ క్లారిటీ ఇచ్చారు.
ఇంతకీ ఏం చెప్పారంటే… విష్ణు ప్రియ తాను కలిసి దయ అనే వెబ్ సిరీస్ లో నటించడం జరిగిందని.. ఆ మూవీ షూటింగ్ సమయంలో విష్ణు ప్రియకి తనకి రిలేషన్ ఏర్పడిందని అన్నారు. అయితే.. అది అందరూ అనుకునే టైప్ కాదని.. మా ఇద్దరి మధ్య కేవలం గురుశిష్యుల బంధం మాత్రమే అని జేడీ చక్రవర్తి చెప్పడం విశేషం. ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుందని చెప్పారు. మొత్తానికి జేడీ చక్రవర్తి విష్ణుప్రియ పై ఎలాంటి క్రష్ లేదని క్లారిటీ ఇచ్చేశారు. మరి.. విష్ణు ప్రియ జేడీ కామెంట్స్ పై రియాక్ట్ అవుతుందేమో చూడాలి.