కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న జాన్వీ కపూర్..?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ భారీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో పాటు చరణ్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది కానీ.. క్లారిటీ రావాల్సివుంది. ఇవే కాకుండా తెలుగులో మరిన్ని భారీ చిత్రాల్లో నటించేందుకు ఆఫర్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బాలీవుడ్ బ్యూటీకి కోలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయట. ఇటీవల విఘ్నేష్ శివన్ జాన్వీకి ఓ కథ నెరేట్ చేశారట. ఈ ఆఫర్ గురించి పాజిటివ్ గా స్పందించిందట కానీ.. ఇంకా కన్ ఫర్మ్ చేయలేదని సమాచారం. ఈ చిత్రాన్ని లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇదే కాకుండా మరికొన్ని ఆఫర్స్ కోలీవుడ్ నుంచి వచ్చాయని వార్తలు వస్తున్నాయి. మరి.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినట్టే.. కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.