ఓటీటీలోకి సుహాస్ “జనక అయితే గనక”

సుహాస్ హీరోగా నటించిన జనక అయితే గనక సినిమా డిజిటల్ ప్రీమియర్ కు వచ్చేస్తోంది. ఆహా ఓటీటీలో ఈ సినిమా వచ్చే నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహా గోల్డ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వాళ్లు ఒక రోజు ముందుగానే నవంబర్ 7వ తేదీ నుంచే ఈ సినిమాను చూడొచ్చు.

జనక అయితే గనక సినిమాను దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వం వహించాడు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించింది. ఈనెల 12న థియేటర్స్ లో జనక అయితే గనక రిలీజైంది. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుందీ మూవీ.