దిల్ రాజుకు కలిసొచ్చిన “జైలర్”

రజనీకాంత్ హీరోగా నటించి నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది జైలర్ సినిమా. ఈ సినిమాను తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ తో కలిసి రిలీజ్ చేశారు దిల్ రాజు. దాదాపు 12 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ సినిమాను పంపిణీ చేయగా..అంత మొత్తం గ్రాస్ తొలిరోజే జైలర్ రాబట్టడం విశేషం. పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక జైలర్ సినిమా తొలి రోజు 7 కోట్ల రూపాయల పైన షేర్ దక్కించుకుంది. ఇలా చూస్తే ఇవాళ, రేపటి కల్లా ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తుంది. మొత్తంగా ఎంత వసూళు చేస్తుందన్నది పక్కన పెడితే ఇవాళ డిస్ట్రిబ్యూటర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా పెట్టుబడి పోకుండా రూపాయి మిగిలినా సంతోషిస్తున్నారు. ఎందుకంటే హిట్ సినిమా చేసిన క్రెడిట్ ఎంతో గుడ్ విల్ తీసుకొస్తుంది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు అంచనా నిజమైంది. ఇక వరల్డ్ వైడ్ గా తొలి రోజు ఈ సినిమా దాదాపు 120 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టడం విశేషం.