మొత్తం విమానంలో జగపతి ఒక్కడే

ఫ్లైట్ ఎక్కుతూ సెల్ఫీ తీసుకున్నాడు యాక్టర్ జగపతి బాబు. ఆ సెల్ఫీని ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ త్రివిక్రమ్ డైలాగ్స్ గుర్తుచేసుకున్నాడు. ఫ్లైట్ నిండా ఖాళీ సీట్లు కనిపిస్తుండగా..సెల్ఫీ తీసుకున్న జగపతి బాబు… తాను ఫస్ట్ ప్యాసెంజర్ గా ఫ్లైట్ ఎక్కడం ఇదే తొలిసారి అంటూ ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్ లైఫ్ ఎస్సెన్స్ తన డైలాగ్స్ లో చెబుతాడని జగపతి బాబు క్యాప్షన్ రాశాడు.

జగపతి బాబు ట్వీట్ చేస్తూ – చాలా సార్లు ఫ్లైట్ లో ప్రయాణించా. కానీ ఫస్ట్ ప్యాసింజర్ గా ఫ్లైట్ లో అడుగుపెట్టడం కొత్తగా ఉంది. విమానంలో ఎప్పుడూ ఇన్ని ఖాళీ సీట్లు చూడలేదు. త్రివిక్రమ్ చెప్పినట్లు ఫ్లైట్ పైకి ఎగురుతుంది మనం కాదు. మనం సీట్లో కూర్చుంటాం అంతే. ఈ ఒక్క డైలాగ్ లో త్రివిక్రమ్ లైఫ్ అంటే ఎంటో చెప్పాడు. అని పేర్కొన్నాడు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీర రాఘవ రెడ్డి సినిమాలో జగపతి బాబు చేసిన విలన్ క్యారెక్టర్ కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తున్న గుంటూరు కారం సినిమాలో విలన్ గా నటిస్తున్నారు జగపతిబాబు. ఇటీవల గుంటూరు కారం సినిమా సెట్ నుంచి జగపతి బాబు క్యారెక్టర్ గెటప్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.