ప్రభాస్ బ్యానర్ లో జగన్ సినిమా..?

యాత్ర సినిమా ఓ సంచలనం. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. గత ఎన్నికల టైమ్ లో వచ్చిన యాత్ర మూవీ రాజకీయ చిత్రమైనప్పటికీ అందర్నీ ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ గా సక్సెస్ సాధించింది. యాత్ర సినిమా టైమ్ లోనే యాత్ర 2 ఉంటుందని మహి వి రాఘవ ప్రకటించడం జరిగింది కానీ.. ఇంత వరకు అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో యాత్ర 2 మూవీ తెర పైకి వచ్చింది.

ఈసారి ఎన్నికల టైమ్ కి యాత్ర 2 మూవీని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ వార్త బయటకు వచ్చిన్పటి నుంచి యాత్ర 2 లో నటించేది ఎవరు అనేది ఆసక్తిగా మారింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. యాత్ర 2 చిత్రాన్ని ప్రభాస్ నిర్మాణ సంస్థ అయిన యు.వి. క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించనున్నారని… దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని వార్తలు వస్తున్నాయి. అయితే.. జగన్ పాత్రను ఎవరు పోషించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఈ పాత్ర పోషించే ఓ స్టార్ కోసం చూస్తున్నారని తెలిసింది. అయితే.. ప్రచారంలో ఉన్నట్టుగా యు.వీ క్రియేషన్స్ యాత్ర 2 చిత్రాన్ని నిర్మిస్తుందా..? లేక వేరే నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందా అనేది తెలియాల్సివుంది.