ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తోన్న మూవీ వార్ 2. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ చిత్రం కూలీ. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్ నటిస్తుండడంతో హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే.. ఈ రెండు సినిమాల మధ్య పోటీ తప్పదని టాక్ వినిపిస్తోంది. వార్ 2 మూవీని ఆగష్టు 14న విడుదల చేయనున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు.
ఇటీవల ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల పై నాటు నాటు రేంజ్ లో ఓ సాంగ్ చిత్రీకరించాలి అనుకున్నారు కానీ.. హృతిక్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కాలికి గాయం అవ్వడంతో ఈ షూట్ కి బ్రేక్ పడింది. దీంతో వార్ 2 రిలీజ్ పోస్ట్ పోన్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. మేకర్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగష్టు 14నే రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అయితే.. కూలీ మేకర్స్ కూడా ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్. అయితే.. ఎన్టీఆర్ వార్ 2 తో పోటీ వద్దు అని రజినీ కూలీ మేకర్స్ కి చెప్పారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడతాయో లేదో చూడాలి.