నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న మూవీ హిట్ 3. ఈ మూవీకి శైలేష్ కొలను డైరెక్టర్. ఇప్పటి వరకు తీసిన హిట్, హిట్ 2 సినిమాలు సక్సెస్ అవ్వడంతో హిట్ 3 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో వయెలెన్స్ ఎక్కువుగా ఉంటుందని.. చిన్న పిల్లలను ఈ సినిమాకి రావద్దని స్వయంగా నాని ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పడంతో హిట్ 3 ఎలా ఉండబోతుందో ఓ క్లారిటీ అయితే వచ్చింది. శైలేష్ కొలను వెంకీతో తీసిన సైంధవ్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని పట్టుదలతో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీని మే 1న విడుదల చేయనున్నారు.
నాని హిట్ 3తో కోలీవుడ్ స్టార్ సూర్య పోటీ పడనున్నాడని టాలీవుడ్, కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. సూర్య నటిస్తోన్న మూవీ రెట్రో. ఈ మూవీలో సూర్యకు జంటగా పూజా హేగ్డే నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తే.. కొత్తగా ఉందనే టాక్ వచ్చింది. సూర్యను కొత్తగా చూపించబోతున్నారు అనిపించింది. తమిళ్ లోనే కాదు.. తెలుగులో కూడా ఈ టీజర్ కు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే.. ఈ సినిమాను మే 1న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక జరిగితే నాని, సూర్య మధ్య బాక్సాఫీస్ పోటీ తప్పదు.