బాక్సాఫీస్ పోటీలో నాని “హిట్ 3”, సూర్య “రెట్రో”

నాని హిట్ 3 అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరో వైపు హీరో సూర్య రెట్రో అంటూ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. నాని, సూర్య మధ్య బాక్సాఫీస్ దగ్గర పోటీ ఏర్పడింది. నాని కెరీర్‌లోనే అత్యంత హింసాత్మక చిత్రంగా, ఆద్యంతం రక్తపాతంతో కూడిన చిత్రంగా హిట్‌ 3 నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని అర్జున్ సర్కార్ అనే షార్ట్ టెంపర్డ్ పోలీస్‌గా కనిపించబోతున్నాడు. సూర్య రెట్రో సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు చేశాయి.

సూర్య రెట్రో మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను తెలుగులోనూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేస్తోంది. ఈ చిత్రాన్ని మే 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాని హిట్ 3 వస్తున్న మే 1నే సూర్య రెట్రో మూవీ కూడా రిలీజ్ అవుతుండడంతో రెండు సినిమాల్లో ఏ సినిమా ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది ఆసక్తిగా మారింది.