సెట్స్ లో పెద్ద స్టార్స్ తో కలిసి నటిస్తున్నప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంటుంది. అదే సంతోషాన్ని భోళా శంకర్ లో నటిస్తున్నప్పుడు ఫీల్ అయ్యానని చెప్పారు హీరో సుశాంత్. సోలో హీరోగా సినిమాలు చేసి..ఇప్పుడు గెస్ట్ రోల్స్ చేస్తున్నారు సుశాంత్. భోళా శంకర్ లో ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నట్లు టీమ్ మెంబర్స్ ఎవరూ చెప్పలేదు కానీ ఆయన తన ఇంటర్వ్యూస్ లో తనది అతిథి పాత్రే అని చెబుతున్నారు. ఈ సినిమాలో ఓ సీన్ లో తనకు చిరంజీవికి మధ్య జరిగిన సన్నివేశం ఎక్సీపిరియన్స్ తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు సుశాంత్.
భోళా శంకర్ లో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్. సుశాంత్ పాసింజర్. దిగాల్సిన ప్లేస్ వచ్చాక కారు డోరు చిరంజీవి తీయాలి. కానీ అక్కడున్నది చిరంజీవి కాబట్టి సుశాంత్ తన డోర్ తానే తీసుకుని కిందకు దిగాడట. అప్పుడు చిరంజీవి…నీది ఒక స్టేటస్ కనిపించాల్సిన క్యారెక్టర్. అందుకే డోర్ నేనే తీస్తా అని చిరంజీవి ముందుకొచ్చారు. ఈ సందర్భాన్ని సుశాంత్ తన ఇంటర్వ్యూలో చెప్పారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి…ఆయన డోర్ తీశాక తాను కారు దిగడం చాలా ఇబ్బందిగా అనిపించిందని సుశాంత్ తన ఫీలింగ్ చెప్పారు. ఎంత సినిమా లొకేషన్, ఎంత యాక్టింగ్ అయినా…పెద్దా , చిన్నా, స్టార్ డమ్ అనేది తప్పకుండా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందికర సందర్భాలు ప్రతి నటుడికీ ఎదో ఒక టైమ్ లో ఎదురవుతుంటాయి.