నేషనల్ అవార్డ్స్ అందుకుని పట్టరానంత సంతోషంలో ఉంది పుష్ప 2 టీమ్. ఈ సినిమాలో నటనకు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ అవార్డ్ సొంతం చేసుకోగా…పాటలకు దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్)గా అవార్డ్ గెల్చుకున్నారు. ఈ సందర్భాన్ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది పుష్ప 2 చిత్రబృందం. ఈ సందడిలో పుష్ప 2 రిలీజ్ గురించి మరో అప్ డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏ రోజున రిలీజ్ చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
వచ్చే ఏడాది మార్చి 22న పుష్ప 2ను పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. దాదాపు సగం షూటింగ్ పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది. మిగతా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివర నుంచే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేపడతారట. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని భాషల్లో డబ్బింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. తొలి పార్ట్ రిలీజ్ అప్పుడు ఈ విషయంలో టీమ్ ఇబ్బందులు పడింది. అవి ఈసారి రిపీట్ కాకుండా చూసుకుంటున్నారు. వచ్చే సమ్మర్ కు బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 రూల్ మొదలుకానుంది.