“భగవంత్ కేసరి” ఓటీటీ డేట్ ఇదేనా?

బాలకృష్ణ, కాజల్, శ్రీలీల లీడ్ రోల్స్ లో నటించిన భగవంత్ కేసరి సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలోని మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ రెండూ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. దసరాకు రిలీజైన భగవంత్ కేసరి మూవీ టీమ్ కు విజయాన్ని అందించింది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించారు. ఇప్పటిదాకా కామెడీ మూవీస్ చేసిన అనిల్ రావిపూడి ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్స్ చేయగలడు అని నిరూపించింది భగవంత్ కేసరి.

ఇక ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ గురించి ఓ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భగవంత్ కేసరి ఈ నెల 23న అమోజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై అఫీషియల్ గా మూవీ టీమ్ నుంచి అనౌన్స్ మెంట్ రాలేదు. డిజిటల్ ప్రీమియర్ ఇంకా మూడు వారాలకు పైగా టైమ్ ఉంది కాబట్టి ఈ సినిమా థియేటర్ రన్ కు ఇబ్బంది ఉండకపోవచ్చు.