యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ లోకి మారిపోయారు. ఈ న్యూ లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎన్టీఆర్ కు కొత్త హెయిర్ స్టైల్ డిజైన్ చేశాడు. ఒక యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ ఈ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది. ఇటీవల పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు ఎన్టీఆర్. మలబార్ జ్యువెల్లర్స్, ఓట్టో షర్ట్స్, నవరత్న ఆయిల్ లాంటివి అందులో కొన్ని బ్రాండ్స్. ఇలాంటి ఓ ప్రముఖ కంపెనీ యాడ్ షూట్ కోసం ఎన్టీఆర్ ఈ న్యూ లుక్ లోకి మారిపోయారు.
అయితే దేవర సినిమాకు ఈ లుక్ కు సంబంధం లేదని అనుకోవచ్చు. అదొక మత్స్యకార నేపథ్య సినిమా. అందులో రా అండ్ రస్టిక్ గా ఎన్టీఆర్ లుక్ ..గతంలో రిలీజ్ చేసిన పోస్టర్ లో చూశాం. సాధారణంగా ఒక సినిమా మేకోవర్ లోకి మారిన తర్వాత కొత్త లుక్స్ కోసం ప్రయత్నించరు. అయితే సినిమా లుక్ కు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా..తిరిగి దేవర లుక్ లోకి ఈజీగా వెళ్లిపోయేట్లు ఈ కొత్త హెయిర్ స్టైల్ డిజైన్ చేసుకున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం దేవర సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.