సమంతతో నందినీ రెడ్డి సినిమా ఉందా..? లేదా..?

నందినీ రెడ్డి అన్నీ మంచి శకునములే అనే సినిమాని తెరకెక్కించింది. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకుంది కానీ.. ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నందినీ రెడ్డి సిద్ధు జొన్నలగడ్డ, సమంత కాంబినేషన్లో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. సమంతతో నందినీ రెడ్డికి మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. గతంలో సమంతతో జబర్థస్త్ అనే సినిమా చేసింది. ప్లాప్ అయ్యింది. ఆతర్వాత ఓ బేబి సినిమా చేసింది ఇది సూపర్ హిట్ అయ్యింది.

ఇప్పుడు మరోసారి సినిమా చేయాలి అనుకుంటుంది. అయితే.. అన్నీ మంచి శకునములే చిత్రం ఫ్లాప్ అవ్వడంతో సమంత నందినీ రెడ్డితో సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపించడం లేదని.. డేట్స్ అడ్జెస్ట్ కావడం లేదని సమంత నందినీతో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. దీంతో సమంత ఈ సినిమా చేస్తుందా..? చేయదా..? అనేది ఆసక్తిగా మారింది. అలాగే నందినీ సమంత కోసం వెయిట్ చేస్తుందా..? లేక వేరే హీరోయిన్ తో సినిమాని స్టార్ట్ చేస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.