పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం సలార్. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ డైరెక్టర్. ఇందులో ప్రభాస్ కు జంటగా శృతిహాసన్ నటించింది. ఇటీవల సలార్ గ్లింప్స్ రిలీజ్ చేయడం.. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సలార్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది..? సలార్ సినిమా రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 ఎప్పుడు వస్తుందా..? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే.. చావు కబురు చల్లగా చెప్పినట్టుగా సలార్ రిలీజ్ వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ప్రశాంత్ నీల్ కి నచ్చకపోవడంతో వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.
అందుకనే సలార్ ట్రైలర్ ఎప్పుడు అనేది ప్రకటించలేదని తెలిసింది. ప్రస్తుతం సలార్ మేకర్స్ ఇదే విషయం గురించి సీరియస్ గా ఆలోచిస్తున్నారని తెలిసింది. త్వరలోనే సలార్ రిలీజ్ వాయిదా వేయనున్నట్టుగా అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తుంది. సీజీ వర్క్ అనుకున్న విధంగా రాకపోవడం.. అనుకున్న టైమ్ కి పూర్తి కాకపోవడం. వాయిదాకి ప్రధాన కారణం అంటున్నారు. మరి.. సలార్ రిలీజ్ ఎప్పుడు అంటే.. డిసెంబర్ లో సలార్ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ కలిగించే వార్త. అయితే.. లేట్ గా వచ్చినా బ్లాక్ బస్టర్ సాధిస్తే చాలు అని అభిమానులు కోరుకుంటున్నారు. మరి.. సలార్ మేకర్స్ ఎలాంటి అనౌన్స్ మెంట్ చేస్తారో చూడాలి.