మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్షతో సూపర్ హిట్ అందుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆయనకు సక్సెస్ దక్కింది. పవన్ కల్యాణ్ తో కలిసి నటించి బ్రో సినిమాతో తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకున్నారు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ఈ రెండు సినిమాలు తనకు మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చాయి. బ్రో బాక్సాఫీస్ హిట్ కాకున్నా…పవన్ తో నటించినందువల్ల అది స్పెషల్ మువీగా మిగిలిపోయింది.
ఇక ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నాడు సాయి తేజ్. యాక్సిడెంట్ గాయాల నుంచి పూర్తిగా హీల్ అయ్యేందుకు రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ బ్రేక్ నుంచి వచ్చాక ఆయన తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలో దర్శకుడు సంపత్ నంది రూపొందిస్తున్నారు.
ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి. భీమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. నవంబర్ లో సాయి తేజ్ ఈ సినిమా సెట్ లో అడుగుపెడతారట.