వెంకీ రానా నాయుడు అంటూ డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ చేశాడు. త్వరలో అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు నాగార్జున కూడా డిజిటల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. నెట్ ఫ్లిక్స్ నాగార్జునతో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు ప్లాన్ చేస్తుందట. పది ఎపిసోడ్ ల ఈ వెబ్ సిరీస్ చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. నాగ్ నవ మన్మధుడు. తనకు ఉన్న ఇమేజ్ కు తగ్గట్టుగానే ఈ వెబ్ సిరీస్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. స్టైలీష్ ఎంటర్ టైనర్ విత్ ఫుల్ రొమాన్స్ తో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని అంటున్నారు.
అయితే.. రానా నాయుడు బోల్డ్ కంటెంట్ తో రావడం వెంకీ పై చాలా విమర్శలు వచ్చాయి. ఆల్రెడీ రొమాంటిక్ ఇమేజ్ ఉన్న నాగార్జున వెబ్ సిరీస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ వెబ్ సిరీస్ తో పాటు తదుపరి చిత్రం గురించి కూడా కథాచర్చలు జరుగుతున్నాయని తెలిసింది. త్వరలోనే నాగార్జున ఈ వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేయనున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే నెక్ట్స్ మూవీ గురించి కూడా ప్రకటన త్వరలో ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మరి.. ఇక నుంచి నాగ్ స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.