నిజంగానే బిగ్ బాస్ 7 కొత్తగా ఉండబోతుందా..?

బిగ్ బాస్ ఓ సంచలనం. బుల్లితెర పై అత్యధికులు వీక్షించిన రియాల్టీ షో ఇది. ఈ రియాల్టీ షోకు మిగిలిన రాష్ట్రాల్లో కన్నా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్ 1 కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వస్తే.. సెకండ్ సీజన్ కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వచ్చారు. ఇక మూడవ సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. అయితే.. ఆరవ సీజన్ కు అంతగా ఆదరణ లభించలేదని.. ఏడవ సీజన్ కు హోస్ట్ గా నాగార్జునను కాకుండా వేరే స్టార్ తో చేయించనున్నారని ప్రచారం జరిగింది. అయితే.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ 7వ సీజన్ కు కూడా నాగ్ నే హోస్ట్ చేస్తున్నారు.

బిగ్ బాస్ 7 ప్రొమోలు రిలీజ్ చేశారు. ఈ ప్రొమోలు చూస్తుంటే.. నిజంగానే ఈసారి బాగా కసరత్తు చేసినట్టు అనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రొమో కూడా ఇంట్రస్టింగ్ గా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మీ అంచనాలకు అందని విధంగా ఉంటుందని నాగ్ స్పష్టం చేస్తున్నారు. ఇది అంతం కాదు, ఆరంభం అంటూ చిటికేసి మరీ చెప్పారు. అంతా ఉల్టా పుల్టా అంటూ ఈ సీజన్ 7 పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశారు. మరి.. బిగ్ బాస్ 7 ఎంత వరకు మెప్పిస్తుందో.. రేటింగ్ లో ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.