సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ, క్రేజీ మూవీ గుంటూరు కారం. ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్ లో చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మేటర్ ఏంటంటే.. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ ఎపిసోడ్ లో మహేష్ బాబు 20 ఏళ్ల యువకుడిగా కనిపించబోతున్నాడట.
విఎఫ్ఎక్స్ సహాయంతో మహేష్ బాబును దర్శకుడు త్రివిక్రమ్ యంగ్ లుక్ లో చూపించబోతున్నాడట. ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ కూడా భారీ యాక్షన్ తో ఉంటాయని.. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా హైలైట్ గా ఉంటుందట. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడేట్టుగా త్రివిక్రమ్ ఈ సినిమా కథని రాశారట. ఈ సినిమా మహేష్ కెరీర్లో 28వ సినిమాగా తెరకెక్కుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.