“కన్నప్ప”లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ?

మంచు విష్ణు కొత్త సినిమా కన్నప్ప ఏప్రిల్ 25న రిలీజ్ కు రెడీ అవుతోంది. భారీ తారాగణంతో..భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండటం అసలైన క్రేజ్ తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడు..? ఆ పాత్ర ఎలా ఉండబోతుంది..? అనేది ఆసక్తిగా మారింది.

రీసెంట్ గా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో కన్నప్ప గురించి మంచు విష్ణు చాలానే చెబుతున్నారు. ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెబుతూ ఇందులో రుద్ర అనే పాత్ర పోషించాడని.. ఈ పాత్ర దాదాపు అరగంట సేపు కనిపిస్తుందని చెప్పాడు. ఇప్పటి వరకు ప్రభాస్ క్యారెక్టర్ ఓ పది నిమిషాలో, పదిహేను నిమిషాలో కనిపిస్తాడని అనుకున్నారు కానీ.. ముప్పై నిమిషాలు కనిపిస్తాడని చెప్పడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో మోహన్ లాల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కోసం 10 సంవత్సరాల వర్క్ చేస్తున్నాడట మంచు విష్ణు.