ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన దేవర బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. అయితే.. దేవర ఆశించిన స్థాయిలో మెప్పించలేదని.. అందుచేత దేవర 2 ఉండదని ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్న వార్తల పై ఎవరూ స్పందించకపోవడంతో నిజంగానే దేవర 2 లేదా..? అనే డౌట్ స్టార్ట్ అయ్యింది. దేవర బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించినా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. 500 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. పైగా కథ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఎన్టీఆర్ ను చూపించిన విధానం గురించి సినిమాటోగ్రాఫర్ పై కూడా విమర్శలు వచ్చాయి. అయితే.. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఈ విమర్శలు మరింత పెరిగాయి. అక్కడ కూడా అంతగా ఆకట్టుకోలేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ దేవర 2 చేయాలి అనుకోవడం లేదని.. ఇక దేవర 2 లేనట్టేనే అని టాక్ వినిపించింది.
దేవర 2 గురించి ఇలా ప్రచారం జరగడం.. మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిఫికేషన్ లేకపోవడంతో నిజమే అనుకున్నారు కానీ.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ మూవీ డైరెక్టర్. ఆగష్టు 14న ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక జనవరిలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ స్టార్ట్ కానుంది. ఫిబ్రవరి నుంచి ఎన్టీఆర్ ఈ మూవీ షూట్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దేవర 2 చేస్తారట. ప్రస్తుతం కొరటాల దేవర 2 స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారని సమాచారం. సో.. దేవర 2 ఉంది. కాకపోతే ఎప్పటి నుంచి సెట్స్ పైకి వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.