“పుష్ప 2” ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu arjun), డైరెక్టర్ సుకుమార్(Sukumar) కాంబోలో రూపొందుతోన్న మూవీ పుష్ప 2(Pushpa 2). ఆగష్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుందని ప్రకటించారు. అయినప్పటికీ.. డిసెంబర్ 6న రావడం కూడా కష్టమే అని.. సమ్మర్ లో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది. బన్నీ, సుక్కు ఇద్దరూ ఖచ్చితంగా డిసెంబర్ 6న వస్తుందని ఇటీవల ఓ ఈవెంట్ లో చెప్పడంతో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. డిసెంబర్ 6న పుష్ప 2 రావడం పక్కా అని కన్ ఫర్మ్ అయ్యింది. మరి.. ఎంత వరకు వచ్చింది..? అవ్ డేట్ ఏంటంటే.. రామోజీ ఫిలింసిటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ నెలాఖరుకు షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకున్నారు కానీ.. నెక్ట్స్ మంత్ ఎండింగ్ కి షూట్ కంప్లీట్ అవుతుందని సమాచారం. ఇంకా ఐటం సాంగ్ చిత్రీకరించాల్సివుంది. మిగిలిన మూడు పాటలను చిత్రీకరించేశారు. ఆల్రెడీ రెండు పాటలను రిలీజ్ చేశారు. జాతర సాంగ్ ను మాత్రం థియేటర్లోనే చూపిస్తారట. ఈ సాంగ్ ను రిలీజ్ కు ముందు రిలీజ్ చేయకూడదని ఫిక్స్ అయ్యారని టాక్. ఐటం సాంగ్ ఎవరితో చేయనున్నారు అనేది ఇంకా ఫైనల్ కాలేదని చెబుతున్నారు కానీ.. ఎవరనేది ఫిక్స్ అయ్యిందని.. త్వరలో అనౌన్స్ చేస్తారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ మూవీని నిర్మిస్తున్నారు.