విజయ్ కొత్త సినిమాకి ఇంట్రస్టింగ్ టైటిల్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. సెప్టెంబర్ 1న ఖుషి చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి పరశురామ్ డైరెక్టర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గీత గోవిందం కాంబోలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ కు జంటగా సీతారామమ్ ఫేమ్ మృణాల్ ఠాగూర్ నటిస్తుంది.

అయితే.. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదు కానీ.. ఇప్పుడు ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఏంటా టైటిల్ అంటారా..? ఫ్యామిలీ స్టార్.. అవును.. దీనినే టైటిల్ గా ఫిక్స్ చేశారని టాక్ వినిపిస్తుంది. గీత గోవిందం సినిమాతో యూత్ ని టార్గెట్ చేస్తే.. ఫ్యామిలీ స్టార్ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఇది విజయ్ దేవరకొండ 13వ చిత్రం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి.. గీత గోవిందం కాంబో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.