రెండు డిఫరెంట్ లుక్స్ లో నిఖిల్ దేవాదుల, ఆకట్టుకుంటున్న “ఘటికాచలం” టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్

కంటెంట్ బాగున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇటీవల ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. థియేటర్స్ తో పాటు ఓటీటీల్లోనూ ఈ జానర్ మూవీస్ సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ లోకి వస్తున్న మరో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఘటికాచలం”(Ghatikachalam). ఈ చిత్రంలో యంగ్ హీరో నిఖిల్ దేవాదుల(Nikhil devadula) నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు(MC raju).

“ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి(Amar kamepalli). ఈ రోజు “ఘటికాచలం” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్, ఫస్ట్ లుక్ కొత్తగా ఉండి ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.