చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తం అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేసిన జీవిత, రాజశేఖర్..ఆ తర్వాత అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఈ కేసు విచారణకు రాగా…వీళ్లిద్దరికి కోర్టు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. జరిమానా కట్టేందుకు సిద్ధమయ్యారు జీవిత, రాజశేఖర్. బెయిల్ పై వీరిద్దరు ప్రస్తుతం బయటకు వచ్చారు.
చిరంజీవితో జీవిత, రాజశేఖర్ లకు ఎప్పటినుంచో గ్యాప్ ఉంది. ఆ మధ్యలో ఒకట్రెండు సందర్భాల్లో వీళ్లు కలిసి మాట్లాడుకున్నా…లోపలి కోపాలు పోలేదు. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో రాజశేఖర్ ఫైర్ అవడం కూడా చిరంజీవి మీద ఉక్రోషంతోనే జరిగిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చిరంజీవి కామ్ గానే ఉంటూ వచ్చారు. తాజా కేసుతో ఈ కపుల్స్ కు ఇబ్బందిలో పడినట్లే.