పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద చేస్తున్న సెన్సేషన్ చూస్తునే ఉన్నాం. బాహుబలి-2 వసూళ్లను కూడా పుష్ప-2 అధిగమించింది. ఇక పుష్ప-2 మరోసారి ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారింది. జనవరి 11 నుంచి పుష్ప-2 రీ లోడెడ్ వెర్షన్ గా.. మరో ఇరవై నిమిషాల పవర్‌ఫుల్ ఫుటెజ్‌ను యాడ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు కానీ.. ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యింది. జనవరి 17 నుంచి కొత్త వెర్షెన్ లోడ్ కానుంది.
పుష్ప 2 32 రోజుల్లో 1831 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే అమీర్ ఖాన్ దంగల్ మూవీ చైనా కలెక్షన్స్ తో కలుపుకుని 2070 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ మూవీ రికార్డ్ ను క్రాస్ చేయాలనే టార్గెట్ తో పుష్పరాజ్ 20 నిమిషాల ఫుటేజ్ కలపనున్నారు మరి.. పుష్పరాజ్ ప్లాన్ వర్కవుట్ అయితే దంగల్ ను దాటేసి పుష్ప 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నెం.1గా నిలుస్తుంది.