“ఆర్ సీ 16″లో నటించడం లేదు – విజయ్ సేతుపతి

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఆర్ సీ 16 సినిమాలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా వస్తున్నాయి. దీనిపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తాను నటించడం లేదని తెలిపారు. దర్శకుడు బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెనలో హీరోయిన్ తండ్రి రాయణం పాత్రలో విజయ్ సేతుపతి నటించారు.

ఈ సినిమా సక్సెస్ లో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కీలకంగా మారింది. అదే సెంటిమెంట్ రామ్ చరణ్ సినిమాలోనూ విజయ్ సేతుపతిని తీసుకునేందుకు బుచ్చిబాబు ట్రై చేస్తున్నారని టాక్ వినిపించింది. అయితే తాజాగా విజయ్ సేతుపతి చెప్పిన మాటలతో క్లారిటీతో వచ్చినట్లయింది. కొన్ని కథలు బాగున్నా అందులో తాను చేయగలిగిన క్యారెక్టర్స్ ఉండటం లేదని విజయ్ సేతుపతి చెప్పారు. ఆర్ సీ 16 సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ లో ఉంది.