చట్టాన్ని గౌరవిస్తా, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటా – అల్లు అర్జున్

చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్. ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని, కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఏమీ మాట్లాడలేనని అన్నారు. గత 20 ఏళ్లుగా తాను థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటివి జరగలేదని అల్లు అర్జున్ చెప్పారు.

తన సినిమాలే కాదు మామయ్య చిరంజీవి సినిమాలను కూడా థియేటర్స్ కు వెళ్లి చూస్తుంటానని ఆయన అన్నారు. ఏమైనా జరిగిన ఘటన దురదృష్టకరమని, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేనని అల్లు అర్జున్ చెప్పారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన చెప్పారు. తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.