రెమ్యునరేషన్ గా ఇచ్చే డబ్బును బ్లాక్ లో తీసుకోను అన్నారు హీరో విక్టరీ వెంకటేష్. ఈరోజు నిర్వహించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ లో వెంకటేష్ పాల్గొన్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలో ఐటీ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో ఐటీ రైడ్స్ గురించి వెంకటేష్ ను ప్రశ్నించగా..తాను తీసుకునేదే కొంత అని, అది మొత్తం వైట్ లో తీసుకుంటా అని ఆయన సమాధానం చెప్పారు.
తాను ఎక్కువ రెమ్యునరేషన్ అడగను అని ఇచ్చిందే తీసుకుంటా అని వెంకటేష్ ఈ సందర్భంగా అన్నారు. మిగతా హీరోల గురించి తనకు తెలియదని వెంకటేష్ చెప్పారు. అనిల్ రావిపూడితో కాంబినేషన్ కొనసాగిస్తానని వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి, సంగీత దర్శకుడు భీమ్స్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజుపై జరుగుతున్నవి రొటీన్ ఐటీ రైడ్స్ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు.