తెలుగు సినిమా సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు తన వంతు ప్రయత్నం ప్రతి సినిమాతో చేస్తానని అన్నారు హీరో విజయ్ దేవరకొండ. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే కల నెరవేరిందని, నచ్చిన పని చేస్తున్న సంతోషం కంటే మిగతా ఏదీ సంతృప్తి ఇవ్వలేదని ఆయన అన్నారు. వివిధ రంగాల ప్రముఖులతో టీవీ 9 ఛానెల్స్ గ్రూప్ ఢిల్లీలో నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్ క్లేవ్ లో హీరో విజయ్ దేవరకొండ అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీతో కలిసి విజయ్ దేవరకొండ ఫొటో తీసుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు విజయ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – సక్సెస్ ఫెయిల్యూర్ లో నాపై ఒకే రకమైన ప్రేమ చూపిస్తున్న అభిమాలకు థ్యాంక్స్. వారంతా గర్వపడేలా నా నెక్ట్స్ మూవీస్ ఉంటాయి. కింగ్ డమ్ కు వాయిస్ ఇచ్చి తారక్ అన్న, సూర్య, రణ్ బీర్ కపూర్ ఎంతో సపోర్ట్ చేశారు. పాన్ ఇండియా ట్రెండ్ లో ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆ సక్సెస్ జర్నీలో హీరోగా నా వంతు పాత్ర పోషిస్తా. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త కథలను చెప్పాలని ఉంది. మనమంతా తెలుగు సినిమాను మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్దాం. అన్నారు.