రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమండ్రి సమీపంలోని వేమగిరి వద్ద ఈ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40 ఎకరాల స్థలంలో ఈవెంట్ జరగనుంది. డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, ఇతర నాయకులు వస్తుండటంతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.
గేమ్ ఛేంజర్ ఈవెంట్ బందోబస్తులో 1600 మంది పోలీస్ అధికారులు విధులు నిర్వహిస్తుండటం విశేషం. లక్షమందికి పైగానే ఈ ఈవెంట్ ను హాజరవుతారని తెలుస్తోంది. అటు జనసేన కార్యకర్తలతో పాటు మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున గేమ్ ఛేంజర్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. ఈ నెల 10న ఈ సినిమా ఘనంగా విడుదలకు సిద్ధమవుతోంది.