పొలిటికల్ బిజీ నుంచి బయటకు వచ్చి తన సినిమాల షూటింగ్ లకు హాజరవుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ చిల్కూరు సమీపంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో అదిరే యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కిస్తున్నారు.
ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పవన్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయి..భారీ ఫైట్ సీక్వెన్సులు చేస్తున్నారు. సినిమాలో కీలకమైన ఫైట్స్ ను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ మళ్లీ పొలిటికల్ గా ఎప్పుడు బిజీగా మారిపోతాడో తెలియని పరిస్థితిలో హరీశ్ శంకర్ పవన్ పోర్షన్స్ త్వరగా తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిన్నటి వరకు పవన్ లేని సీన్స్ మిగతా ఆర్టిస్టులతో పిక్చరైజ్ చేశాడీ డైరెక్టర్.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ హిట్ మూవీ తెరీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కు రానుంది.