నాగచైతన్యతో డైరెక్టర్ పరశురామ్ సినిమా చేయాలి అనుకున్నాడు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ సంస్థ నిర్మించాలి అనుకుంది. అంతా సెట్ అయ్యింది. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకుంటున్న టైమ్ లో పరశురామ్ కి మహేష్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. అంతే.. నాగచైతన్యతో అనుకున్న సినిమాని పక్కనపెట్టేసి మహేష్ బాబుతో సినిమా చేస్తానని వెళ్లిపోయాడు. ఇది నాగచైతన్యకు, 14 రీల్స్ సంస్థకు బాగా కోపం తీసుకువచ్చింది. సర్కారు వారి పాట తర్వాత నాగచైతన్యతో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు.
గీతా సంస్థలో గీత గోవిందం సీక్వెల్ చేయాలి. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయాలి అనుకుంటున్న టైమ్ లో దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేస్తున్నాను అని అనౌన్స్ చేశారు. ఇలా ఒకరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని మరొకరికి సినిమా చేయడంతో పరశురామ్ కు బ్యాడ్ నేమ్ బాగా వచ్చింది. ఇటీవల నాగచైతన్య తన కోపాన్ని ఓ ఇంటర్ వ్యూలో బయటపెట్టారు. అల్లు అరవింద్ ఇటీవల 2018 కేరళ స్టోరీ థ్యాంక్స్ మీట్ లో ఇన్ డైరెక్టర్ గా పరశురామ్ పై ఫైర్ అయ్యారు. 14 రీల్స్ సంస్థ పరశురామ్ కి ఇచ్చిన అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేమన్నదట. తను తీసుకున్న అడ్వాన్స్ కు వడ్డీ కలిపితే 13 నుంచి 14 కోట్లు ఇవ్వాల్సి వచ్చిందట. మాట మీద నిలబడకుండా.. చైతన్య సినిమా చేయకుండా.. మహేష్ బాబుతో సినిమా చేయడం వలన పరశురామ్ పొందింది ఏమో కానీ.. పొగొట్టుకున్నదే ఎక్కువ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి.. ఇక నుంచైనా పరశురామ్ ఇలా జరగకుండా చూసుకుంటే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.