బాక్సాఫీస్ వద్ద “డీమాంటీ కాలనీ 2” జోరు

బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది హారర్ థ్రిల్లర్ “డీమాంటీ కాలనీ 2”. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మార్నింగ్ షోస్ నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే తమిళంలో బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో వేసిన పెయిడ్ ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దీంతో “డీమాంటీ కాలనీ 2” మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమా డే 1 వసూళ్లలో దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణలో మొదటి రోజున 76.40 లక్షల రూపాయల వసూళ్లు సాధించింది “డీమాంటీ కాలనీ 2”.

సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో పాటు లవ్, ఎమోషన్, మంచి మ్యూజిక్, బలమైన స్క్రిప్ట్ ఈ సినిమాకు ఆకర్షణ అవుతున్నాయి. ఈ సినిమాను ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. “డీమాంటీ కాలనీ 2” సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటించారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించారు.