ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన’హోం టౌన్’

ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసేలా తెరకెక్కిన ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ 10 నిమిషాలు ఫ్రీ ప్రివ్యూ అందుబాటులో ఉందని ఆహా అనౌన్స్ చేసింది. ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ లో రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు. శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కష్టసుఖాలు ఎలా ఉంటాయి. ఆ ఇంట్లో బాధ్యతలు తెలియని వయసున్న కొడుకు ఎలా ప్రవర్తిస్తాడు. స్నేహితులతో అతని సరదా టీనేజ్ లైఫ్ ఎలా సాగింది. కొడుకు మీద తండ్రి పెట్టుకున్న ఆశలు నిజమయ్యాయా..ఇలాంటి అంశాలతో ‘హోం టౌన్’ వెబ్ సిరీస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. 90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ సక్సెస్ తర్వాత అలాంటి జానర్ లో వస్తున్న హోం టౌన్ వెబ్ సిరీస్ ఆహా టాప్ లో ట్రెండ్ కాబోతోంది.