“హిట్ 3” టీజర్ రివ్యూ – నాని మరో రాంగ్ సెలెక్షన్ చేశాడా?

హీరో నానికి ప్రేక్షకుల్లో ఒక ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియెన్స్ చూసేలా సినిమాలు చేస్తాడనే పేరుంది. దసరా సినిమాలో ఎంత మాస్ ఉన్నా…ఆ ఇమేజ్ కు ఇబ్బంది రాకుండానే క్యారెక్టర్ డీల్ చేశాడు దర్శకుడు. ఈ ఇమేజ్ కు భిన్నంగా గతంలో నాని వీ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశాడు. నానిని వయలెంట్ క్యారెక్టర్ జనం చూడలేదు. రిజెక్ట్ చేశారు. ఇటీవల సరిపోదా శనివారం కూడా తనను మాస్ యాక్షన్ హీరోగా ప్రెజెంట్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సినిమా అంతంతమాత్రమే సక్సెస్ అయ్యింది.

ఇలాంటి టైమ్ లో నాని హిట్ 3 అంటూ మరో ఇంటెన్స్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించాడు నాని. ఈ రోజు నాని బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన హిట్ 3 టీజర్ చూస్తుంటే నాని మరో రాంగ్ సెలెక్షన్ చేసుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీజర్ లో బ్లడ్ షెడ్, హింస, బూతు డైలాగ్ ఇది నాని చేయాల్సిన సినిమా కాదనే ఫీల్ కలిగిస్తోంది. మే 1న రిలీజ్ కానున్న హిట్ 3 రిజల్ట్ నాని ఇకపై ఇలాంటి సినిమాలు చేయాలా వద్దా అనేది డిసైడ్ చేస్తుంది.