నాని “హిట్ 3” షూటింగ్ లో విషాదం

నాని హీరోగా నటిస్తున్న హిట్ 3 సినిమా షూటింగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఈ సినిమా కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక్కడ షెడ్యూల్ జరుపుతున్న క్రమంలో సినిమాటోగ్రాఫర్ వర్గీస్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్న కృష్ణ అనే యువతి గుండెపోటుతో మృతి చెందింది.

ఛాతి నొప్పితో ఇబ్బందిపడుతున్న ఆమెను శ్రీనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె చికిత్స పొందుతూనే కన్నుమూసింది. టీమ్ మెంబర్ చనిపోవడంతో హిట్ 3 చిత్రబృందంలో విషాదం నెలకొంది. కృష్ణ కేరళకు చెందిన యువతి. హిట్ 3 సినిమాను దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు.