పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు టీమ్ రెడీ అవుతోంది. పవన్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే గ్లింప్స్ కట్ వర్క్ పూర్తయ్యిందట. నిమిషం 12 సెకన్ల విడివి గల ఈ గ్లింప్స్ ను నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో కట్ చేసినట్లు సమాచారం.
ఇక ఈ గ్లింప్స్ అదిరిపోయేలా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ గతంలో ఎప్పుడూ లేనంతగా ఓ గ్లింప్స్ గురించి ఇంతగా చర్చ జరుగుతోంది. ఓజీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఈ హైప్ కు కారణంగా భావించవచ్చు. ముంబైలో తన గ్యాంగ్ తో కలిసి పవన్ వెళ్తున్న పిక్ ను రిలీజ్ చేశారు. ఓజీ గ్లింప్స్ బ్లాస్ట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మాతగా దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాంగ్ స్టర్ కథతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతోంది.