ఎన్టీఆర్ మూవీలో బాలకృష్ణ హీరోయిన్

బాలకృష్ణ హీరోగా నటించిన సక్రాంతి మూవీ డాకూ మహారాజ్ తో థియేటర్స్ లో సందడి చేసింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా. ఇప్పుడీ నాయిక ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీలో అవకాశం దక్కించుకుంది. రీసెంట్ గా ఎన్టీఆర్ నీల్ మూవీ బిగిన్ అయ్యింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నారు.ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఊర్వశీ రౌటేలను ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారట. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేయబోతున్నారు. వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ నీల్ సినిమా రిలీజ్ టార్గెట్ పెట్టుకుంది.