పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తమన్నా

తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ తమన్నా. ప్రేక్షకులు ఇంకా తనను ఆదరిస్తున్నందు వల్ల ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదని తెలిపింది. పెళ్లి చేసుకుంటే కెరీర్ కు ఇబ్బంది కలుగుతుందని ఆమె అభిప్రాయపడింది. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది తమన్నా. అతనితో కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించిన సందర్భంగా ప్రేమలో పడింది తమన్నా. ఆ తర్వాత తరుచూ అనేకసార్లు వీళ్లిద్దరు కలిసి కనిపించారు. అప్పటి నుంచి మీడియా వీరి ప్రేమ కథను సర్క్యులేట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే తమన్నా పెళ్లి చేసుకుంటుందనే వార్తలొస్తున్నాయి. వీటిపై స్పందించింది తమన్నా. ఆమె మాట్లాడుతూ – వివాహ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది. పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. అయితే ఇప్పుడు నా కెరీర్ స్పీడ్ గా వెళ్తోంది. వెబ్ సిరీస్ లతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వల్ల కెరీర్ కు బ్రేక్ వేసినట్లే. అందుకే కొంతకాలం ఆగి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. గతంలో కంటే ఇప్పుడు నా అభిప్రాయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నా. అని తెలిపింది.

ఇటీవల తమన్నా నటించిన జైలర్ సినిమా సూపర్ హిట్టయ్యింది. అలాగే తెలుగులో చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో నటించిందీ హీరోయిన్. ఆమెకు ఓటీటీలో పలు క్రేజీ వెబ్ సిరీస్ లు దక్కుతున్నాయి. డిజిటల్ వేదికలను తమన్నా మిగతా నాయికలంటే బాగా ఉపయోగించుకుంటోంది. జైలర్ సూపర్ హిట్ వల్ల ఆమెకు కోలీవుడ్ లో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.