హీరో సుధీర్ బాబు సరైన సక్సెస్ లేక ఇబ్బందిపడుతున్నాడు. ఇప్పుడీ హీరో జటాధర అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకట్ కళ్యాణ్ డైరెక్టర్. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాతో బాలీవుడ్ హీరో సోనాక్షి సిన్హా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి సోనాక్షి ఓ సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది. ఇంతకీ ఏం చెప్పిందటంటే.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుగుతుందని.. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇలాంటి చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ ఆమె పేర్కొంది. సోనాక్షి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. త్వరలోనే జటాధర తాజా షెడ్యూల్ లో జాయిన్ అవుతానని చెప్పింది. సుధీర్ బాబు ఇటీవల నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. ఈ మూవీతో సుధీర్ బాబు ఆశించిన సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.