మయోసైటిస్ పై అవగాహన కల్పించనున్న సమంత

గతేడాది సెప్టెంబర్ లో తనకు మయోసైటిస్ వ్యాధి ఉందని వెల్లడించి అందరినీ బాధకు గురిచేసింది సమంత. అప్పుటికింకా ఆమె ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా రిలీజ్ కాలేదు. మయోసైటిస్ వ్యాధి ఇబ్బందితోనే యశోద ప్రమోషన్స్ లో పాల్గొంది సమంత. ఆ తర్వాత తనకున్న వ్యాధి గురించి ధైర్యంగా చెప్పి…అలాంటి రుగ్మతలతో ఇబ్బంది పడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. సమంత చూపించిన ఈ ధైర్యాన్ని గుర్తిస్తూ మయోసైటిస్ ఆఫ్ ఇండియా సంస్థ ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది.

ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు సమంత ముందుకొచ్చింది. ప్రస్తుతం సమంత మయోసైటిస్ కోసం అమెరికాలో చికిత్స తీసుకునేందుకు వెళ్లింది. తన మదర్ తో కలిసి సమంత రెండు నెలల పాటు అమెరికాలో చికిత్స తీసుకోనుందని తెలుస్తోంది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు సినిమాల నుంచి ఏడాది పాటు దూరంగా ఉండనుందని సమాచారం. ఇటీవల ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ లో సమంత మాట్లాడుతూ…ప్రేక్షకుల అభిమానంతో సూపర్ హిట్ తో తెరపైకి వస్తానని, మరిన్ని మంచి సినిమాలు చేస్తానని చెప్పింది.