ఈ రోజు హీరోయిన్ రశ్మిక మందన్న తన బర్త్ డే జరుపుకుంటున్నారు. ఆమెకు స్పెషల్ గా బర్త్ డే విశెస్ తెలియజేసింది “ది గర్ల్ ఫ్రెండ్” మూవీ టీమ్. ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ తో పాటు టీజర్ లో వచ్చిన రేయి లోలోతుల సితార సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ కొత్త పోస్టర్ లో రశ్మిక మందన్న వారియర్ లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఆమె చేతిలో గన్, నైఫ్ ఉండటం ఆసక్తికరంగా ఉంది. రేయి లోలోతుల పాట ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా ఆకట్టుకుంటోంది. ఈ పాటలో విజయ్ దేవరకొండ వాయిస్ స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
“ది గర్ల్ ఫ్రెండ్” సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. త్వరలో “ది గర్ల్ ఫ్రెండ్” సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.