అంతకంటే ఇంకేం కావాలి

హీరోయిన్ రశ్మిక మందన్న బాలీవుడ్ లోనూ తన స్టార్ డమ్ చూపిస్తోంది. అక్కడ పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. సల్మాన్ సరసన సికిందర్ మూవీ చేస్తున్న రశ్మిక..ఛావా అనే మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. వికీ కౌశల్ హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 14న ఛావా రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో రశ్మిక కాలికి గాయంతో పాల్గొంది. సినిమా పట్ల ఆమెకున్న కమిట్ మెంట్ ను ఈ ఇన్సిడెంట్ చూపించిందనే అప్రిషియేట్ చేస్తున్నారు బాలీవుడ్ వాసులు.

ఛావా ప్రమోషనల్ ఈవెంట్ లో రశ్మిక మాట్లాడుతూ ఈ సినిమా కంప్లీట్ అయ్యాక ఇక రిటైర్ మెంట్ తీసుకోవచ్చు అనిపించింది. అంత గొప్ప క్యారెక్టర్ లో నటించే అవకాశం ఈ మూవీ ద్వారా దక్కింది. నటిగా నాకు అంతకంటే ఇంకేం కావాలనే ఫీలింగ్ కలిగింది. ఛావా మూవీలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో మీకు కనిపిస్తా. ఇలాంటి అరుదైన క్యారెక్టర్ ఇచ్చిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ కు థ్యాంక్స్. అని చెప్పింది.