తన భర్త ఎలా ఉండాలో చెప్పేసింది స్టార్ హీరోయిన్ రశ్మిక మందన్న. తన అందానికి, పేరుకు తగినవాడు కావాలని ఆమె క్లారిటీ ఇచ్చింది. రశ్మికకు కాబోయే భర్త ఎలా ఉండాలనే ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మీరు చెప్పేది నిజం అంటూ పేర్కొంది. ఆ ట్వీట్ లో రశ్మిక నేషనల్ క్రష్ కాబట్టి ఆమెకు కాబోయో వాడు స్పెషల్ గా ఉండాలి, వెరీ డేరింగ్ గా ఉంటూ రశ్మికను ప్రొటెక్ట్ చేయాలి, రశ్మిక క్వీన్ లాంటిది కాబట్టి అతను కింగ్ లా ఉండాలి. అంటూ వచ్చిన ట్వీట్ ను దట్స్ వెరీ ట్రూ అంటూ రీట్వీట్ చేసింది రశ్మిక.
ఈ రీట్వీట్ తో తన జీవితంలోకి భాగస్వామిగా అలాంటి వాడు కావాలని చెప్పేసింది. రశ్మిక ఇండస్ట్రీలో క్వీన్ లాగే పేరు తెచ్చుకుంది. పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ అయ్యింది. మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఇటు ఇండస్ట్రీ, అటు ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. బాలీవుడ్ లోనూ యానిమల్ వంటి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇప్పుడు తెలుగులో పుష్ప 2 సినిమాలో నటిస్తోంది.